Thursday, 19 January 2012

TCS Careers 2012 – TCS Plans to hire 15000 Employees in First 3 Months


TCS Careers 2012 – TCS Plans to hire 15000 Employees in the first 3 months of 2012. With this 15,000 recruitment TCS will complete it’s 60,000 Freshers recruitment in the 2011-12 fiscal.
As Said by TCS Global HR Ajoy Mukherjee till now they’ve hired 51,000 Employees and 15,000 more recruitment is yet to commence and this recruitment will be completed by March 2012.The attrition rate of TCS also fell to 12.8% So TCS is becoming one of the best company for students to build their career.
So If you’re a fresher and If you’re Interested to build your career with TCS, You can register for TCS through the below link.

MANAGEMENT LESSONS FROM THE FILM '' BUSINESSMAN''



                 MANAGEMENT LESSONS FROM THE FILM '' BUSINESSMAN''

                    చూసే కళ్ళుంటే, అర్థం చేసుకునే మనసుంటే నేర్చుకునేందుకు అనేక విషయాలుంటాయి. ఈ మధ్యే రిలీజై సంచలనం సృష్టిస్తున్న బిజినెస్ మేన్ సినిమాలో మేనేజ్ మెంట్ కు సంబంధించిన వ్యక్తిత్వ వికాస శిక్షణకు సంబంధించిన విషయాలు చర్చిద్దాం.

                    దర్శకుడు పూరీ జగన్నాధ్ నిత్యం అనేక పుస్తకాలు చదవడమే కాకుండా అనేక ప్రముఖ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలలో ఉన్న విషయాలను కథానాయకుల వ్యక్తిత్వాన్ని మలచడానికి ఉపయోగిస్తుంటారు. బిజినెస్ మేన్ చిత్రం లో అనేక విషయాలు ఒక మంచి వ్యక్తిత్వవికాసానికి సంబంధించిన పుస్తకానికి కావలసిన సబ్జెక్ట్ , సత్తా, పటుత్వం అన్నీ ఉన్నాయి... ఈ మధ్య ఒక పత్రికా సమావేశంలో ఈ సినిమా కథాంశాన్ని ఒక పుస్తకం గా రాస్తానని చెప్పడం చాలా ఆనందించదగ్గ విషయం. ఇవి మీ అందరితో పంచుకుందామనే ఆసక్తి ఈ వ్యాసం రాయడానికి మూల కారణం.  సినిమా తయారీలో ఉన్న భారీ పెట్టుబడి కోసం కొంత మసాలా అన్ని వర్గాల కోసం  జోడించినా  సినిమా కథాంశంలో  యువత ప్రయోజనం కోసం  కొన్ని నియమాలను పాటించడం పూరీ జగన్నాథ్  గారి ఆనవాయితీ...
                
                  ప్రతీ మేనేజ్ మెంట్ నిపుణులు   పీటర్ డ్రక్కర్  మొదలుకొని స్టీఫెన్ కొవె వరకు చెప్పే సూత్రాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి.   మా వ్యక్తిత్వ వికాస  శిక్షకులు నిర్వహించే సెమినార్ లలో  పోకిరీ సినిమాకి సంబంధించిన రెఫరెన్స్  డైలాగ్  కానీయండి లేదా సన్నివేశం కానీయండీ లేకుండా  మా సెమినార్ లు పూర్తి కావు అంటే అతిశయోక్తి కాదు.   నేటి యువతకు  సినిమా  మాధ్యమంలో  ఈ నియమాలు బాగా తలకెక్కుతాయి. మహేష్  బాబు లాంటి  భారీ  యూత్  ఫాలోయింగ్ హీరో తో చెప్పిస్తే  అనుసరించే వాళ్ళ సంఖ్య కూడా పెరగవచ్చు.  కొన్ని మేనేజ్ మెంట్ సూత్రాలు  క్రింద తెలియచేయబడ్డాయి.

1. HAVE A CLEAR GOAL - DECLARE IT
 :

                      ఈ సినిమాలో  చాలా  ఖచ్చితం గా చెప్పిన విషయం ఏమిటంటే  ప్రతీ ఒక్క వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలి.  నీ లక్ష్యం  10  మైళ్ళు అయితే 11 వ  మైలుకి  గురి పెట్టు అని చాలా  స్పష్టం గా చెబుతాడు హీరో.    సినిమా ప్రారంభంలో హీరో తాను ముంబాయికి ఎందుకు వచ్చాడో  చాలా స్పష్టం గా చెబుతాడు. ఏదో నెమ్మదిగా పనిచేసుకోడానికి రాలేదు. మాఫియా మళ్ళీ  పునరజ్జీవింపచేయడమే లక్ష్యం అంటాడు.   కాని అంతిమ లక్ష్యం ఏమిటనేది కథా గమనం లో తెలుస్తుంది.   నీ లక్ష్యం ఎలా ఉండాలంటే  అది వినేవాళ్ళకు  ఆశ్చర్యం కలగాలి. నోరు వెళ్ళబెట్టాలి. అబ్దుల్ కలాం అంటారు low aim is a crime అని.   Crime  కి  సంబంధించిన aim  అయినప్పటికీ  ఇక్కడ లక్ష్యం చిన్నదా పెద్దదా? అనేది ముఖ్యం.  లక్ష్యం తరుచూ ప్రకటించడం వలన దానిని సాధించాలనే కమిట్ మెంట్  పెరుగుతుంది.  లక్ష్యం  అనేది  కాలం తో పాటు  మారుతూ ఉండాలి.   చివరిలో  మహేష్ బాబు  హీరోయిన్ తో ఒక వేళ నీ ప్రేమ నిజమై నే బ్రతికితే  ముంబాయి కి  కాదు ఇండియా మొత్తానికి..........  అంటూ   సిగ్నిఫికెంట్ గా  చేయి చూపిస్తాడు.  Micro Aims will  be changed into Macro Aims along with the time. 

2. DEVELOP TRUST AMONG THE PEOPLE 
;

                      లక్ష్యం ఉంటే సరికాదు  దానిని సాధించేందుకు  సరిపడా జట్టు ఏర్పాటు చేసుకోవాలి  తన వారందరిలో తనకు  ఆ సత్తా   ఉందనే విశ్వాసం  కలిగించాలి.   అందుకే తన లక్ష్యాన్ని ప్రకటించినపుడు నోరు వెళ్ళిబెట్టిన బ్రహ్మాజీ ని చాచి కొడతాడు. నీవంటే  భయం కలుగుతుందిరా అంటే  నీకే భయం కలిగించలేకపోతే ముంబాయికి ఎలా భయం కలిగించ కలుగుతానని అంటాడు.  డోగిరీ కి వెళ్ళి అక్కడ క్రిమినల్స్  చితక్కొట్టి తాను అందరినీ నడిపించగల నాయకుడినని అందరికీ పని కల్పిస్తానని ఎటువంటి ఈగోలు లేకుండా తన క్రింద పని చెయ్యమని చెప్పి ఒక్కొక్కడికి డబ్బు అడ్వాన్స్ గా ఇచ్చి  వారి విశ్వాసం పొందుతాడు.  షకీల్ ని జైల్ లో చంపించి లాలూ (  షియాజీ షిండే     )  విశ్వాసం పొందుతాడు. తాను  ప్రారంభించే  బిజినెస్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి నాజర్ ని పిలిచి  '' నీ లాంటి కసి ఉన్నవాడు  మా డిపార్ట్ మెంట్ లో ఎందుకు లేదని ''  అతని విశ్వాసం పొందుతాడు.  నాయకుడికి ఉండవలసిన మొదటి లక్షణం  ప్రజల విశ్వాసం, విశ్వసనీయత  పొందగలగడం.  అది కోల్పోయిన వాళ్ళు తిరిగి పొందడానికి ఎన్ని పాట్లు పడుతుంటారో నిజ జీవితంలో చూస్తున్నాం.   పది రోజుల్లో అందరి ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తానన్న మాట నిలబెట్టుకోవడం ద్వారా అక్కడ ప్రజల మద్దతు పొందుతాడు.  విశ్వసనీయత, నమ్మకం  జట్టును గాని ప్రజలను గాని నడిపించేందుకు ముఖ్యమైన సాధనాలు

3. INFORMATION GIVES CONFIDENCE 
       
                 హీరో  తన తల్లిదండ్రులను చంపిన ప్రకాష్ రాజ్ పై పగ సాధించడానికి   అమాయకంగా  పధ్నాలుగు సంవత్సరాల వయస్సులో బహిరంగంగా చంపడానికి సిద్ధపడి, విఫలమైన తర్వాత తన లక్ష్యాన్ని సాధించడానికి  సంబంధించిన , దానికి కావలసిన సమచారం సంపాదిస్తాడు.   షకీల్  వలన లాలూకి గల  ఇబ్బంది తెలుసుకుంటాడు.  తనగురించి  నెగటివ్  సలహ ఇస్తున్న ధర్మవరపు సుబ్రమణ్యం రహస్యాలను చెప్పడం ద్వారా  అతని ద్వారానే  '' వీడికున ఇన్ఫర్మేషన్ , కాన్ఫిడెన్స్  చూస్తే  వీడిని నమ్మొచ్చు'' అనిపిస్తాడు.  మహారాష్ట్ర బ్యాంకు లో  ఉన్న పట్టాల గురించి ,  విలన్  నజీర్ ని చంపబోతున్న విషయాన్ని.  ఇంకా అనేక సందర్భాలలో   విషయం ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లతో సిధ్ధంగా ఉంటాడు.   లక్ష్యాన్ని   సాధించాలనుకునే ప్రతీవారు తెలుసుకోవలసినది ఇదే.  knowledge is power & knowledge gives you confidence.  ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కో సెంటర్ లో ఎంత ఖర్చవుతుందో తెలుసా  అని ధర్మవరపు సుబ్రమణ్యం ఎగతాళీగా అడిగితే  అహ్మదాబాద్ నుండి మొన్న కడప వరకు ఎంత ఖర్చయిందో  ప్రస్తుతం ఎంత అవవచ్చునో  సమాచారం చెబుతుంటే అంతా నివ్వెరపోతారు మనతో సహా.    చేతిలో ఉన్న  సమాచారమే  ఆత్మ విశ్వాసాన్ని  పెంపొందిస్తుంది.   ఆఖరికి ప్రకాష్ రాజ్ ని ఎలక్షన్ నుండి అనర్హున్ని చేసే సమాచారం  అతనికి అన్ని విధాల ఉపయోగపడుతుంది.   So always try acquire information by enhancing your knowledge.


4. FORM BUFFER CENTERS & DEVELOP A TEAM AND MAINTAIN WITH WIN/WIN
             
                   హీరీ మహేష్ బాబు ముంబాయికి వచ్చాక  తనకు కావలసిన సహాయం ఎప్పటికప్పుడు పొందేందుకు   ఒక buffer center  గా  షియాజీ  షిండే ని ఏర్పాటు చేసుకుంటాడు.  అతనికున్న సమస్యని తొలగించడం ద్వారా అతని మద్దతు పొందుతాడు. ఎంతకావాలంటే నీకు డబ్బుకి  మర్డర్ లు చేసే వాడిలా  కనబడుతున్నానా  అని    అతనిని తన అవసరాలు తీరుస్తూ   తన లక్ష్యాన్ని సాధించేందుకు  లాంగ్ రన్ లో ఉప్యోగపడేందుకు  ఉపయోగిస్తాడు.  అంతే కాక  తన  అంతిమ లక్ష్యం  ప్రకాష్ రాజ్  కాబట్టి దానికి ఉపయోగపడే విధం గా ముంబాయిలో తన పట్టుకోసం  బలమైన టీం ఏర్పాఋ చేసి వారి  అవసరాలు ఎప్పటికప్పుడు జీతాలిస్తూ  తీరుస్తాడు.    Team Building and Team performing are the important keys in the success of any individual or organization.   ప్రజలను ఉపయోగించుకోవడమే తప్ప  వారికి తగినంతగా ఉపయోగపడకపోవడమే  అనేకమంది నాయకులు అర్ధాంతం గా  కనుమరగవడానికి  కారణం. 

5.. TAKE CALCULATED RISK - DEVELOP SAFEGUARD MECHANISM 
: 

               తాను ఎంచుకున్న లక్ష్యం  అత్యంత ప్రమాదకరమైనది కాబట్టి ఎప్పటికప్పుడు  తన రిస్క్  కి సంబంధించి  తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆ  పరిణామమ్లోనే  హీరోయిన్ ని  ప్రేమలో  దించుతాడు  తన ప్రాణాలకు రిస్క్  పోలీస్ డిపార్ట్ మెంట్  కాబట్టి   కమీషనర్ కూతురైన కాజల్  ని  ఎంచుకుంటాడు.   కాని చివరికి ఆమె          ప్రేమలో  పడతాడు  అందుకు తగ్గ రిస్క్  తీసుకుంటాడు  అది వేరే సంగతి.   తన ప్రాణాలను రిస్క్ పెట్టినప్పుడల్లా  తగిన జాగ్రత్తల్లో ఉంటాడు.  ''  అందరం మనుషులమే   అందరికీ  ఫేమలీస్  ఉన్నాయి.  చదువుకున్న వాళ్ళే కదా  ఎమోషనల్  అవ్వద్దమ్మా '' .  అంటూ  తనని ఏమైనా  చేస్తే  ఏం జరగబోతుందో  చాలా స్పష్టం గా చెబుతాడు.   ఎమోషన్ల్ బ్లాక్ మెయిలింగ్  సరైనది కాకపోయినప్పటికీ   రిస్క్ ఉన్నప్పుడు   జాగ్రత్తలవసరమే.    Dont take chance at the risk of your life  అంటారు.   చివర్లో   కాజల్ కి తన ప్రేమ మీద నమ్మకం కలిగించడం కోసం,  విలన్లను చంపడానికి  తనను తాను కాల్చుకుంటాడు.  రిస్క్ లేనిదే సక్సెస్ ఉండదు గదా...

6. HAVE COMMUNICATION AND NEGOTIATION SKILLS 
       
                  మహేష్ బాబు  తన హీరోయిజం అంతా  మంచి కమ్యూనికేషన్ లో  చూపిస్తాడు.  ఇరవై వేలు రుపాయలను ఇరవై వేల డాలర్లనడం  మోసగించడం కానపుడు  తాను చేసినది మోసం కాదని కాజల్  ని  కన్వన్ష్   చేస్తాడు.   దేవుడ్ని కొలవడం కూడా బిజినెస్  అని చెప్పడం,   లేడీని పులి వేటాడటం డిస్కవరీ చానల్ లో  చూసే వాళ్ళంతా లేడీ బ్రతకాలని కోరుకుంటారు, తీరా ఏడీ బ్రతికాక హాయిగా నవ్వుకొని కోడి ని చంపి పలావ్ చేసుకొని తింటారు. వారికి లేడి మీద జాలి కన్నా, పులి ని ఏమీ చేయలఏమన్న ఏడుపే ఎక్కువ అని చెప్పడం, చేపలను తినడం వయలెన్స్ కాదా అని చెప్పడం,     క్రైం చేసుకునే వాళ్ళకు వెధవ ఈగో లెందుకు  అనడం,  షియాజీ షిండే కు  దగ్గరవడం కాని  ఆఖరికి   డిల్లీని నీకే ఇస్తా  అని   తన ప్లాన్ ఆఫ్  ఆక్షన్  ని జాతీయస్థాయి నాయకుడి దగ్గర తెలియపరచడం  ఇవన్నీ   తన ప్రభావపూరిత  కమ్యూనికేషన్ కి పరాకాష్ఠ  అని చెప్పొచ్చు.  ఈ రోజుల్లో ఎంతమంది  అంత చక్కని కమ్యూనికేషన్ కలిగి ఉన్నారు.  క్లాస్ లో  తన స్వంత క్లాస్ మేట్స్ వద్ద  సెమినార్  చెప్పాలంటే, ఇంటర్వ్యూ బోర్డ్ ముందు నిలబడాలంటే  ఆఖరికి  తన తల్లి దండ్రులతో తన ఇష్టాయిష్టాలు చెప్పాలంటే  బొమ్మరిల్లు సీన్  జరగాల్సిందే  కాని తమ అభిప్రాయాలను  సరిగా  చెప్పలేకపోతున్నారు.   A word  rules the world.   Napoleon Bonaparte ,   Adolf Hitler, Abraham Lincoln. Barack Obama ,  N.T.R    లు వీరంతా నాయకులవగలిగారంటే  వారి కమ్యూనికేషన్  మరియు  సంప్రదింపులు చెయ్యగలిగే నైపుణ్యమే.  ఈ సినిమాలో కథానాయకుడు  తన  సంభాషణా చాతుర్యం తో  పోలీస్ కమీషనర్ ని,  ఆయన కూతుర్ని  , ఆఖరికీ  సినిమా చూడటానికొచ్చిన ప్రేక్షకుల హృదయాల్ని    కేజీలల్లో  కాదు  క్వింటాలలో కొట్టేస్తాడు.

7. HAVE RIGHT PHILOSOPHY OF LIFE
                
           ''  ఎవడి సినిమా వడిదే.  ఎవడి సినిమాకి వాడే  హీరో.''  ఇదే  దర్శకుడు ఈ సినిమా ద్వారా  చెప్పాలనుకున్నది.  అనేకమంది మా వాడి సినిమా ఇన్ని రోజులాడింది, ఇంత కలెక్షన్స్ వసూలు చేసింది  అంటూ    వీధులకెక్కి  కాదు చివరికి టీ వీ  చానెల్లెక్కి  తన్నుకు చస్తున్నారు.  బహుశా  వారికి ఈ విషయం ఎవరు చెప్పిన  అర్థం  కాదని   మహేష్ బాబు చెప్పించాడు.  ప్రతి  ఫ్రేం లో   హీరో  తన జీవితం గురించి,   ఇతరుల అభిప్రాయాల గురించి స్పష్టం గా విశ్లేషిస్తాడు.   ఇక్కడ  ఎవరి ప్రపంచం  వారిదే.  నా ప్రపంచం నీకు అర్థం కాదు. అని హీరోయిన్ తో అంటాడు.  దేవుడి గురించి,  హింస గురించి ఆఖరికి  మాఫియా గురించి   తన ఆలోచనలు అందరినీ  ఆలోచింప చేస్తాయి.
          ప్రతీ ఒక వ్యక్తి కూడా తన జీవితం గురించి, తన ఆలోచనల గురించి,  తన జీవన విధానం గురించి నిర్ధిష్ట అభిప్రాయాలు కలిగియుండాలన్నదే  ఈ సినిమా చెప్పే  గొప్ప మేనేజ్ మెంట్  పాఠం  

8. SUCCESS DEPENDS UPON NET WORKING :
    
        నీవు ఉన్నతంగా  ఎదగాలంటే  ఎంతమంది తో సత్సంబంధాలు కలిగియున్నావన్నదే ముఖ్యం.  మొత్తం దేశం  అంతా తన నెట్ వర్క్  విస్తరింప చేయడమ్ తో జాతీయ రాజకీయాలను సైతం నిర్దేశించగల స్థాయికెలతాడు.   ప్రతీ రాజకీయ నాయకులు నిత్యం ప్రజలతో మమేకం  అవడానికి  ప్రయత్నించేది ఇందుకే... కొంత అధికారం చెతికొస్తే అహంకారం తలకెక్కి ప్రజలకు దూరమై  చివరికి  అడ్రస్ లేకుండా పోయిన నాయకులెంతోమంది  మన వ్యవస్థలో ఉన్నారు.  ప్రతీ చోట, ప్రతీ ప్రదేశం లో  తన వారిని  ఏర్పాటు చేసుకొని చాలా సంస్థలు బహుళ జాతి సంస్థలుగా ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెందుతున్నాయి.    నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆక్టోపస్ లా  అష్టదిక్కులా  వ్యాప్తి చెందడమే  మనం నేర్చుకోవలసినది. 

9. READY TO SACRIFICE  FOR DREAM :
  
        ప్రతి ఒక్కడికీ ఒక కల ఉంటుంది.  కలలు లేనివాడు మనిషే కాదు.  కాని ఈ  సినిమాలో  హీరో అడుగుతాడు నీ కలకోసం ఏమి  త్యాగం చేయగలవని.   ముంబాయిని  శాంతిగా ఉంచుదామనే కల కమీషనరైన నాజర్ కి ఉంటుంది  దానికోసం  ఏం చెయ్యగలరు. మీ కూతుర్నిచ్చి పెళ్ళి చెయ్యగలరా?  అని ప్రశ్నిస్తే  వారికి కాదు    చూస్తున్న ప్రేక్షకులకి మాట రాదు..  కల కంటే  సరి కాదు.  ఆ  కల సాకరం  పొందేందుకు ఎంతటి త్యాగానికైనా  సిద్ధపడాలి.   పిల్లల భవిష్యత్ గురించి కలలు కనే తల్లిదండ్రులు అహోరహం శ్రమించే తల్లిదండ్రులు, తాము కనుకొనవలసిన రహస్యాలకోసం  రేయనక పగలనక  ప్రయోగశాలల్లో గడిపే సైంటిస్ట్ లు    ఇలా ఎంతమందొ తమ కలల సాకారం కోసం శ్రమిస్తున్నారు. త్యాగాలకు సిద్ధంగా ఉంటున్నారు.   కాని  కలలు కంటూ  రోడ్డు మీద  వాల్ పోస్టర్ లకు  పాలాభిషేకాలు,  రక్తాభిషేకాలు చేసే వారు  ఏం త్యాగాలు చేస్తున్నారో?...   చివరికి  కాజల్ ప్రేమను పొందడానికి  తన ప్రాణాలను త్యాగం చెయ్యడానికి సిద్ధపడతాడు.   కసి, శ్రమ, త్యాగం  జీవిత వ్యాపారాలు చేసే  ప్రతీ  కలల బేహారులకు  నిత్య పెట్టుబడులు.  

10. LIFE IS A MESSAGE.  :

                  '' జీవితం అనేది ఒక  యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేసాడు.   Be alert   , protect  your self.   లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి .  కసితో పరిగెత్తండి.  పాడాలనుకుంటే కసిగా  పాడేయండి.  చదవాలనుకుంటే కసిగా  చదివేయండి. లైఫ్ లో ఏ గోల్ లేనివాళ్ళు మాత్రం  వీలైనంత త్వరగా చనిపోండి. మీవలన మాకు  ఏ ఉపయోగం లేదు. గుర్తు పెట్టుకో  నీ కంటే తోపు  ఎవ్వడూ  లేడిక్కడ. నీకు  ఏదనిపిస్తే  అది చెయ్యి.  ఎవ్వడి మాట వినొద్దు.  మనిషనే వాడి మాట అసలు వినొద్దు.  నీ టార్గెట్  టెన్ మైల్స్ అయితే  ఎయిమ్ ఫర్  ద లెవెన్త్  మైల్. . కొడితే దిమ్మ తిరిగిపోవాలి.  చల్. ''  ఇది  చివరిలో దర్శకుడు  మహేష బాబు ద్వారా  అందించే సందేశం.   ఇదే   ఈ సినిమా నేర్పే జీవిత సత్యం. ఇవి  మహేష్ బాబు పాత్ర ద్వారా  దర్శకుడు పూరీ జగన్నాధ్  తన అనుభవాలనుండి నేర్చుకున్న జీవిత సత్యాలను  వ్యక్తిత్వ వికాస పాఠాలుగా  చెప్పించాడు.   దీని ద్వారా  తెలుసుకునేది  ఒకటే ఎన్ని ఆటంకాలైనా ఒంటరిగా ఎదుర్కొని  ఎదురీతలతో గమ్యాన్ని చేరావా  నీ జీవితం ఒక సందేశం  అవుతుంది. నీవు చెప్పె  ప్రతీ అక్షరసత్యం ఎంతో మందికి మార్గదర్శకం అవుతుంది. నీవి నడిచిన దారి  పదిమందికి గమ్యం చేర్చే రహదారి అవుతుంది. . నీ వద్దకు టీవీ చానెళ్ళు కెమెరా పట్టుకొని వస్తే  నీ  డైలాగ్స్ నీవు చెప్పగలగాలి.   No one kicks a dead dog.     Be a hero.  live like a hero  and  die  like  a hero.